OUR TIE WITH OUR TIMES  

Astrology,Ancient Indian texts,Culture,Philosophy
3#122#4 Ashok Nagar Colony
BODDUPPAL
HYDERABAD, ANDHRA PRADESH 500039

ph: 9849337539
alt: 040 65353584

CHITRA

 

అంతా మామూలే...!

అంతా మామూలే
ఇది ఎంతో మామూలే
ఆర్టీసీ బస్సు ఆలస్యమైనా
ఎంటీపీఎస్లో బాంబు దొరికినా
అంతా మామూలే ఇది ఎంతో మామూలే!

ఫైల్లో అంతా గడబిడ అయినా
ఆఫీసరెంతో చిరు బుర్లాడినా
క్యారేజ్ డబ్బ మరచిపోయినా
పక్కనోడి దగ్గర అప్పు పెట్టినా
అంతా మామూలే... ఇది ఎంతో మామూలే.

చెత్త కుండిలో చంటిపిల్ల దొరికినా
మత్తెకినోడు కారు తోలినా
కన్న కూతురు ఇంటికి రాకపోయినా
పెంచుకున్న కొడుకే నిన్ను మరచిపోయినా
అంతా మామూలే... ఇది ఎంతో మామూలే.
 
కన్న తండ్రి కడతేరిపోయినా
ఇంటి ఇల్లాలు మంచాన పడినా
నువ్ దాచిన డబ్బు హుళక్కి అయినా
రోడ్ మీదనే నిను పొడిచేసినా
అంతా మామూలే... ఇది ఎంతో మామూలే!

ఇన్ని జరిగినా ఇంత జరిగినా
ఇంతటి స్థితప్రఙ్ఞత్వం ఎలా సాధించానంటారా?
ఇదిగో ఇదిగో సమాధానం--
నేనో మధ్యతరగతి భారతీయుణిగా
రోజు టీవీ చూస్తూవుంటాగా!
అందుకే
అంతా మామూలే... ఇది ఎంతో మామూలే!

-వెంకటసత్యవతి

Copyright 2009 Astrology, Film reviews,Indian culture and philosophy. All rights reserved.

Web Hosting by Yahoo!

Astrology,Ancient Indian texts,Culture,Philosophy
3#122#4 Ashok Nagar Colony
BODDUPPAL
HYDERABAD, ANDHRA PRADESH 500039

ph: 9849337539
alt: 040 65353584